తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరుణ్​-మేనకా గాంధీకి భాజపా షాక్​- ఎందుకిలా?

భాజపాలో మేనక-వరుణ్​ గాంధీల(varun gandhi news) ప్రాధాన్యం తగ్గిపోతోందా? వారిని పార్టీ అధిష్ఠానం పక్కనపెట్టిందా? ఇంత కాలం కీలక బాధ్యతలు చేపట్టిన వారిని ఇప్పుడు కమలదళం పట్టించుకోవడం లేదా? దీనికి పార్టీపై వరుణ్​ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలే కారణమా?(lakhimpur news today) భాజపా కార్యనిర్వాహక బృందంలో వారి పేర్లు లేకపోవడం వల్ల ఆ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.

varun gandhi news
వరుణ్​ గాంధీ

By

Published : Oct 7, 2021, 3:41 PM IST

పార్టీ అజెండా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే జాతీయ కార్యనిర్వాహక(bjp executive member list) బృందంలో 80మందితో కూడిన సభ్యుల జాబితాను భాజపా గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో(bjp news today) పీలీభిత్​ ఎంపీ వరుణ్​ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ పేర్లు లేకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపుర్​ హింసాత్మక ఘటనలపై వరుణ్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే, ఆయన పేరు జాబితాలో లేకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్​ ఘటనపై వరుణ్​ గాంధీ రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను(lakhimpur incident video) సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేస్తూ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు. ఇది పార్టీ నాయకత్వానికి అంతగా నచ్చినట్టు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

"జరిగినదాంట్లో తప్పంతా రాజకీయ నేతలదే అన్నట్టు వరుణ్​ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఘటన జరగడం దురదృష్టకరం. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నివేదిక కోసం ఎదురుచూస్తున్నాము. ఈ సమయంలో వరుణ్​ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. విపక్షాలన్నీ భాజపాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సమయంలో వాటికి తగ్గట్టుగానే గాంధీ కూడా మాట్లాడారు. ఆయన కొంత సంయమనం పాటించి ఉండాల్సింది" అని భాజపా నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:-'లఖింపుర్ హింస' ఎన్నికల్లో భాజపాను దెబ్బకొడుతుందా?

వరుణ్​ ఒక్కరే కాదు, ఆయన తల్లి మేనకా గాంధీని(maneka gandhi news) కూడా కార్యనిర్వాహక బృందం జాబితా నుంచి తప్పించింది పార్టీ. వీరిరువురు ఎంతో కాలంగా కమలదళంలోనే ఉండి పార్టీ కోసం కృషిచేశారు. తాజా పరిణామాలతో పరిస్థితులు మారాయి. అయితే జాతీయ కార్యనిర్వాహక కౌన్సిల్​లో ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కనపెట్టాలన్న విషయంలో తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డాదేనని, ఇప్పుడు కూడా సమర్థులనే చేర్చుకున్నారని ఉత్తర్​ప్రదేశ్​ భాజపా నేత అభిప్రాయపడ్డారు.

"వారి(మేనకా గాంధీ, వరుణ్​ గాంధీ) స్థానాల్లో ఇతర సీనియర్లు వచ్చారు. గాంధీలకు ప్రాధాన్యం తగ్గిపోయిందనుకుంటా. వరుణ్​ గాంధీ ప్రకటనలు పార్టీకి విరుద్ధంగా ఉన్నాయి. ఏ విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే."

--- ఉత్తర్​ప్రదేశ్​ భాజపా నేత.

లఖింపుర్​ ఘటన.. వరుణ్​ వ్యాఖ్యలు..

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరిలో(lakhimpur news today) ఆదివారం హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడం వల్ల ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. నిరసనకారులు రెండు కార్లను తగలబెట్టారు. ఘటన సమయంలో తమ కుమారుడు వాహనంలో లేడని, అక్కడ ఉన్నవారే భాజపా కార్యకర్తలను, కారు డ్రైవరును కొట్టి చంపారని అజయ్‌ మిశ్ర ఆరోపించారు.

ఘటన జరిగిన తర్వాత భాజపాను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు వరుణ్​ గాంధీ. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు. హింసపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. అహింసా మంత్రాన్ని పాటించే మహాత్మా గాంధీ జయంతి జరిగిన తర్వాత రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

"నిరసన చేస్తున్న రైతులు ఈ దేశ పౌరులే. అన్నదాతలు తమ సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంటే.. మనం కూడా ఓపికతో వాటిని పరిష్కరించాలి. లఖింపుర్ ఘటనలో నిందితులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. రైతులకు భవిష్యత్​లో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలి."

-- వరుణ్​ గాంధీ, భాజపా ఎంపీ.

కీలకమైన 'బృందం'

కార్యనిర్వాహక బృందంలో(bjp news today) కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, ఇటీవలే మంత్రివర్గంలో చేరిన అశ్వినీ వైష్ణవ్ సహా పలువురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రులు హర్షవర్ధన్​, రవిశంకర్​ ప్రసాద్​, ప్రకాశ్​ జావడేకర్​కూ చోటు కల్పించారు. ​80 మంది సాధారణ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 179 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు.

జాతీయ కార్యనిర్వాహక బృందం.. కేంద్ర ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూ.. పార్టీ అజెండాను సిద్ధం చేయటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొవిడ్​-19 కారణంగా చాలా కాలంగా కార్యనిర్వాహక బృందం సమావేశాలు నిర్వహించటం లేదు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details