తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వస్థలానికి మాండవీయ.. ఆ గ్రామస్థులకు దగ్గరుండి టీకా! - మన్సుఖ్ మాండవియ స్వస్థలం?

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ తన స్వగ్రామంలో పర్యటించారు. వ్యాక్సినేషన్ కవరేజీని పెంచేందుకు ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు గ్రామస్థులకు దగ్గరుండి టీకా వేయించారు.

mansukh mandaviya
మన్సుఖ్ మాండవియా

By

Published : Nov 4, 2021, 10:17 PM IST

కేంద్ర ఆరోగ్య మంత్రి గుజరాత్‌లోని తన స్వస్థలమైన పాలిటానా గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన 'హర్ ఘర్ టీకా' కార్యక్రమంలో భాగంగా షెత్రుంజీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లిన మన్సుఖ్ మాండవియా.. ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరారు. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నారు.

మన్సుఖ్ మాండవియా
మన్సుఖ్ మాండవియా
మన్సుఖ్ మాండవియా

"ఈరోజు నేను నా స్వస్థలమైన పాలిటానాలో ఉన్నాను. ప్రధాని మోదీ పిలుపు మేరకు నా దీపావళిని షెత్రుంజీ గ్రామంలో జరుపుకుంటున్నాను. ఇక్కడి ప్రజలకు దగ్గరుండి టీకాలు వేయించా. మిగతా వారూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరా."

-మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

కేరళలో మరో 7వేల మందికి కరోనా..

  • కేరళలో కొత్తగా 7,545 మందికి కరోనా(Kerala Corona Cases) సోకింది. మహమ్మారి ధాటికి 136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 32,734కు పెరిగింది.
  • మహరాష్ట్రలో కొత్తగా 1,141 కరోనా కేసులు వెలుగు చూశాయి. 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో 918 కరోనా కేసులు నమోదయ్యయి. మరో 14మంది ప్రాణాలు కరోనాతో చనిపోయారు.
  • కర్ణాటకలో 261 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details