గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో హింసకు సంబంధించిన కేసులో పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఎర్రకోటపై కత్తితో విన్యాసాలు చేసిన నిందితుడు మణిందర్ సింగ్ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
"ఘటన జరిగిన రోజు ఎర్రకోట వద్ద నిందితుడు కత్తులు తిప్పుతూ విన్యాసం చేసిన దృశ్యాలు సంబంధిత వీడియోలో ఉన్నట్లు గుర్తించాం. నిరసనకారులను రెచ్చగొట్టే విధంగా అతను ప్రవర్తించాడు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేలా మరో ఆరుగురిని ప్రోత్సహించాడు. ఆ రోజు 4.3 అడుగుల పొడవు ఉండే రెండు కత్తులను వెంట తీసుకు వచ్చాడు."