తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ రమ్మీకి మరో ప్రాణం బలి! - ఆన్​లైన్ రమ్మీ

ఆన్​లైన్​ జూదానికి బానిసలై ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసులు హెచ్చరిస్తున్నా ఎందరో ఆ వలలో చిక్కుకుని అప్పులపాలై చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదే తరహా ఘటన కేరళలోని కుట్టిచల్ గ్రామంలో జరిగింది. ఆన్​లైన్​ రమ్మీతో అప్పుల పాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

online rummy, ఆన్​లైన్ రమ్మీ
ఆన్​లైన్​ రమ్మీకి మరో ప్రాణం బలి!

By

Published : Jan 2, 2021, 7:00 PM IST

ఆన్​లైన్​ రమ్మీలో డబ్బు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్నాడు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కుట్టిచల్ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడిని అదే గ్రామానికి చెందిన వినీత్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

22 లక్షలు బాకీ..

జూదానికి బానిసైన వినీత్​ అప్పుల పాలై 22 లక్షలు బాకీ ఉన్నాడు. ఈ విషయాన్ని అతని బంధువులు వెల్లడించారు. అప్పుల బాధ పడలేక డిసెంబరు 31 సాయంత్రం ఇంటి వెనుక ఉన్న చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి :బ్రిటన్​ ప్రయాణికులకు 'కొత్త' మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details