పొట్టిగా ఉన్న తనకు ఎవరూ పెళ్లికి పిల్లనివ్వడం లేదంటూ... వార్తల్లో నిలిచిన అజీమ్ మన్సూరీకి బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నుంచి ఆహ్వానం అందిందట. సినిమాల్లో నటించేందుకు ముంబయి రావాలని సల్మాన్ కోరినట్లు వెల్లడించారు అజీమ్. అయితే ఆ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న మన్సూరీ.. ప్రస్తుతం తన దృష్టి వివాహం చేసుకోవడం మీద ఉన్నట్లు వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్ శామ్లీకి చెందిన 26 ఏళ్ల అజీమ్ మన్సూరీ.. 2 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉన్నందువల్ల పెళ్లి కుదరలేదని ఇటీవల మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పారు అజీమ్.