తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీ పోలీస్​ చీఫ్' ఫొటోతో లాయర్​కు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్ - దిల్లీ కమిషనర్​ కేసు

దిల్లీ పోలీస్​ నగర కమిషనర్​ రాకేశ్​ అస్థానా ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్​ పిక్చర్​గా పెట్టుకుని ఓ న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

Delhi Police Chief
Delhi Police Chief

By

Published : May 29, 2022, 7:01 AM IST

Delhi Police Chief Photo Man Used: గుర్తు తెలియని వ్యక్తి.. దిల్లీ కమిషనర్​ రాకేశ్ అస్థానా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ న్యాయవాది​ బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నట్లు దిల్లీ న్యాయవాది మంజీత్​ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయవాది మంజీత్​ సింగ్​.. వాట్సాప్ చాట్​ డేటాతో పాటు కాల్​ లిస్ట్​ను కూడా పోలీసులకు అందించారు. అయితే దుండుగుడు.. వాట్సాప్​ ఎకౌంట్​కు దిల్లీ పోలీసు చీఫ్​ ఫొటోను ప్రొఫైల్​ పిక్చర్​గా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details