తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రయాణికుడి వికృతచేష్టలు.. ఎయిర్​పోర్ట్ గేట్ దగ్గర మూత్రం పోసి.. అడ్డుచెప్పిన వారిపై.. - ఢిల్లీ విమానాశ్రయం మూత్రం

మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు హల్​చల్ చేశాడు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గేటు ఎదుట మూత్రం పోశాడు. అడ్డు చెప్పిన ఇతర ప్రయాణికులను దుర్భాషలాడాడు.

IGI airport man urinates
IGI airport man urinates

By

Published : Jan 11, 2023, 3:46 PM IST

విమానాల్లో ప్రయాణికుల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ బయటపడుతున్నాయి. దిల్లీలో ఇలాంటి మరో ఘటన ఒకటి జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గేటు వద్ద ఓ ప్రయాణికుడు మూత్రం పోశాడు. మూడు రోజుల క్రితం ఇది జరిగిందని అధికారులు తెలిపారు. దీనిపై ఎయిర్​పోర్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బెయిల్ బాండ్​పై వదిలిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడిది బిహార్ అని పోలీసులు తెలిపారు. అతడిని జౌహార్ అలీ ఖాన్(39)గా గుర్తించారు. జనవరి 8న దిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మామ్​కు అతడు వెళ్లాల్సి ఉందని చెప్పారు. ప్రయాణానికి ముందు ఎయిర్​పోర్టుకు చేరుకున్న అతడు.. టెర్మినల్ 3 వద్ద ఉన్న ఆరో నెంబర్ గేటు సమీపంలో మూత్రం పోశాడని వివరించారు. నిందితుడు మత్తులో ఉన్నాడని, ఇతర ప్రయాణికులను తిడుతూ కనిపించాడని చెప్పారు.

దీనిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టపక్కల వారు వారించినా వినిపించుకోలేదని కంప్లైంట్ ఇచ్చారు. ప్రయాణికులపై అరుస్తూ బీభత్సం సృష్టించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని బెయిల్ బాండ్​పై రిలీజ్ చేసినట్లు చెప్పారు.

ఇటీవల శంకర్ మిశ్ర అనే వ్యక్తి ఎయిర్ఇండియా విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పతాగిన అతడు మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. నవంబరు 26న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత బెంగళూరులో తలదాచుకున్న శంకర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో శంకర్‌ ఉద్యోగంపైనా వేటు పడింది. అమెరికన్‌ ఫైన్షానియల్‌ సంస్థ వెల్స్‌ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న అతడిని ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది.

ABOUT THE AUTHOR

...view details