కేరళలోని ఎర్నాకులంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బార్లో ఫుల్‌గా మద్యం తాగిన అశ్లీ (54) అనే వ్యక్తి కారును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కారులో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు.
అసలేం జరిగిందంటే: ఓ వ్యక్తి భోజనం కొనేందుకు కారును రోడ్డుపక్కన ఆపి రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ కారులో అప్పటికే అతడి భార్య, బిడ్డ ఉన్నారు. అయితే అంతలోనే ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి వచ్చి కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. బాధితురాలు సహాయం కోసం కేకలు వేసింది. అయినా నిందితుడు కారును ఆపలేదు. అశ్లీ మొదట పాదచారిని ఢీకొట్టాడు. అనంతరం దుకాణంపైకి దూసుకెళ్లింది. అయినా ఆగకుండా కారును వేగంగా నడిపాడు. చివరకి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె బిడ్డకు గాయాలయ్యాయి.
నిందితుడు అశ్లీని (54) చొట్టనిక్కర పోలీసులు అరెస్టు చేశారు. మొదట నిందితుడు మద్యం మత్తులో అతడి కారునే తీసుకెళ్లిపోతున్నాడేమో అని భావించారు స్థానికులు. అయితే పోలీసు విచారణలో అశ్లీ కారు చోరీకి ప్రయత్నించినట్లు తేలింది.
లోపల మనుషులున్నా కారు చోరీ తర్వాత ఏమైందంటే - చొట్టనిక్కర పోలీస్ స్టేషన్
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారు చోరీకి యత్నించాడు. అప్పటికే కారులో ఓ మహిళ, చిన్నారి ఉన్నట్లు అతడు గమనించలేదు. తర్వాత ఏమైందంటే
మద్యం మత్తులో కారు చోరీ యత్నం