మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని ముంబ్రాలో ఓ యువతితో తన సంబంధాన్ని వదులుకునేందుకు నిరాకరించడని.. 18 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు దాడి చేసి హింసించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
రహస్య భాగాలపై కత్తి, రాడ్తో దాడి చేశారని.. తర్వాత కొండపై నుంచి నెట్టివేశారని బాధితుడు ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన బాధితుడు.. సహయం కోసం తన స్నేహితుడికి ఫోన్ చేశాడు.