Man Torched His Lover: ప్రేమించిన అమ్మాయిని కులం పేరుతో దూరం పెట్టాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడిన ప్రియురాలిని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.
కులం వేరని..
Man Torched His Lover: ప్రేమించిన అమ్మాయిని కులం పేరుతో దూరం పెట్టాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడిన ప్రియురాలిని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.
కులం వేరని..
దానేశ్వరి(23), బాదామికి చెందిన శివకుమార్ చంద్రశేఖర్ హిరేహళ.. విజయపుర ఇంజనీరింగ్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే వారు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. కొన్నాళ్లు సహజీవనం చేశారు. చదువు పూర్తయిన తర్వాత బెంగళూరులో ఉద్యోగ జీవితం కూడా ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కోరింది. తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పిన యువకుడు.. ఇంటికి వెళ్లి వచ్చాడు. కులాలు వేరైన కారణంగా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. ప్రియుడు పని చేసే ప్రదేశానికి వెళ్లి.. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ప్రాధేయపడింది. ప్రేయసితో దురుసుగా ప్రవర్తించాడు శివకుమార్. దానేశ్వరిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ప్రియురాలిని మళ్లీ అతడే ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతూ ఆ అమ్మాయి మృతి చెందింది.
ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:మహిళపై ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్.. లవర్ అరెస్ట్!