దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు సదరు నిందితుడ్ని పట్టుకొని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఏం జరిగింది?
దిల్లీ బాపనగర్లోని ఓ జీన్స్ ఫ్యాక్టరీలో పని చేసే వ్యక్తి.. తమ బాలికతో కనిపించగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన.. గత శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని చెప్పారు.