Nupur sharma: భాజపా మాజీ నేత నుపుర్ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూసినందుకు ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు! 23 ఏళ్ల అంకిత్ ఝా అనే వ్యక్తిపై మరో వర్గానికి చెందిన నలుగురు.. కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బిహార్లోని సితామర్హీ జిల్లా నాన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం: అంకిత్ ఓ పాన్ షాప్ దగ్గర వాట్సాప్ చూస్తుండగా నిందితులు అతని వద్దకు వచ్చి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంకిత్ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు మతపరమైన ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్ శర్మ వీడియో చూడడమే కారణం'! - యువకుడిపై హత్యయత్నం
Nupur sharma controversy: బిహార్లోని ఓ యువకుడిపై మరో వర్గానికి చెందిన పలువురు కత్తితో దాడి చేశారు. నుపుర్ శర్మ వివాదాస్పద వీడియో చూడటం వల్లే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మాతో బలవంతంగా..: ఈ హత్యాయత్నానికి, నుపుర్ శర్మ వివాదానికి సంబంధం ఉందంటున్నారు బాధితుడి కుటుంబసభ్యులు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు నుపుర్ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూస్తున్నాడని.. అందుకే ఓ వర్గానికి చెందిన నిందితులు అతని దాడి చేశారన్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో ఆ పేరును ఫిర్యాదులో ప్రస్తావనకు తీసుకురాకూడదని.. అలానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు బలవంతం చేసినట్లు ఆరోపించారు. కానీ అంకిత్ కుటుంబసభ్యుల ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనకు, మతఘర్షణలకు ఎలాంటి సంబంధం లేదని.. పరారీ ఉన్న నలుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సితామర్హీ ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి :వినూత్నంగా నాగపంచమి వేడుకలు.. వందల పాములను మెడకు చుట్టుకొని..