Man Stabbed By Brother : దేశంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలో ఓ వ్యక్తి తన అన్నపై మరో వ్యక్తితో కలిసి కత్తితో దాడి చేశాడు. వెంటనే తమ్ముడి దాడి నుంచి తప్పించుకున్న సోదరుడు.. కత్తి మెడపై ఉండగానే బైక్‌పై ఒక కి.మీ పాటు ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు. బాధితుడిని తేజస్ పాటిల్ అనే వ్యాపారవేత్త(32)గా పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది..
తేజస్ పాటిల్.. సంపాడలోని సెక్టార్ 5లో నివసిస్తున్నారు. తేజస్ తన ఇంట్లో నిద్రిస్తుండగా జూన్ 3వ తేదీ రాత్రి.. ఆయన సోదరుడు మోనీశ్(30), మరో వ్యక్తితో కలిసి తన అన్నపై కత్తితో దాడి చేశాడు. దీంతో తేజస్ మెడపై కత్తి ఉండిపోయి.. తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే నిందితులు ఇద్దరూ ఘటనాస్థలి నుంచి పరారరయ్యారు. నొప్పి, రక్తస్రావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. తేజస్ ఒక కిలోమీటరు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు వెంటనే తేజస్‌కు శస్త్రచికిత్స చేసి ఆయన మెడపై ఉన్న కత్తిని తొలగించారు. మెడపై దాడి జరిగినా.. ధమనులు, సిరలు దెబ్బతినకపోవడం వల్ల తేజస్ ప్రాణాలతో బయటపడ్డారని వైద్యులు తెలిపారు. తేజస్‌పై దాడికి పాల్పడిన అతడి తమ్ముడు మోనీశ్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులిద్దరి కోసం గాలిస్తున్నారు.
కత్తితో పొడిచి హత్య..
23 ఏళ్ల యువకుడిని కత్తితో దారుణం పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన దిల్లీలోని నెబ్సరాయ్ ప్రాంతంలో సోమవారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మృతుడిని సచిన్‌గా గుర్తించారు. నిందితులు.. మృతుడికి తెలిసినవారేనని పోలీసులు తెలిపారు.