తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టికెట్​ లేకుండా వందేభారత్​ ఎక్కి.. బాత్​రూమ్​లోకి వెళ్లి కొన్ని గంటలపాటు అలానే.. చివరకు.. - వందేభారత్​ రైలు లేటెస్ట్ అప్డేట్లు

టికెట్‌ తీసుకోకుండా వందే భారత్​ రైలు ఎక్కిన ఓ వ్యక్తి.. బాత్​రూమ్​లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. చివరకు తలుపు విరగ్గొట్టి అతడిని ఆర్పీఎఫ్​ అధికారులు బయటకు తీసుకువచ్చారు.

man-shuts-himself-inside-for-hours-in-kerala-vande-bharat-express-washroom
man-shuts-himself-inside-for-hours-in-kerala-vande-bharat-express-washroom

By

Published : Jun 26, 2023, 7:45 AM IST

Updated : Jun 26, 2023, 8:23 AM IST

కేరళలోని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. టికెట్‌ తీసుకోకుండా రైలు ఎక్కిన ఓ వ్యక్తి టాయిలెట్​లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు వచ్చేందుకు ససేమిరా అంటూ గంటల తరబడి లోపలే ఉండిపోయాడు. చివరకు తలుపు విరగ్గొట్టి అతడిని ఆర్పీఎఫ్​ అధికారులు బయటకు తీసుకువచ్చారు.

అసలేం జరిగిందింటే?
ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కాసర్‌గోడ్‌ జిల్లాలో వందే భారత్​ రైలు ఎక్కాడు ఓ వ్యక్తి. వెంటనే బాత్​రూమ్​లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ప్రయాణికులు, అధికారులు.. ఎంత పిలిచినా బయటకు రాలేదు. గంటలు తరబడి లోపలే ఉండిపోయాడు. ఆ రైలు దాదాపు 275 కి.మీ ప్రయాణించి శోర్‌నూర్‌ స్టేషన్​కు చేరిన తర్వాత అధికారులు చేసేదేమి లేక మరుగుదొడ్డి తలుపు విరగ్గొట్టారు. అతడిని బయటకు తీసుకువచ్చారు.

బాత్​రూమ్​లోకి వెళ్లి గడియ వేసుకున్న వ్యక్తి

అయితే ఎర్రటి టీషర్టు ధరించి భయం భయంగా చూస్తున్న ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతున్నాడని, స్వస్థలం ఆరా తీయాల్సి ఉందని ఆర్పీఎఫ్​ అధికారులు చెప్పారు. తనను కొంతమంది తరుముకొంటూ వచ్చారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాత్​రూమ్​లోకి దూరి.. గడియ వేసుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు.

కేరళలలో రెండు నెలల క్రితం.. ప్రధాని మోదీ జెండా ఊపివందేభారత్​రైలును ప్రారంభించారు. అయితే రైలును ప్రారంభించిన తొలి రోజే.. వందే భారత్ రైలులో లీకులు కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. లీక్ నేపథ్యంలో గమ్యస్థానం కాసర్​గోడ్​​ వెళ్లాల్సిన ఈ సెమీ హైస్పీడ్​ రైలు.. కన్నూర్​ రైల్వే స్టేషన్​లోనే నిలిచిపోయింది. వెంటనే అధికారులు.. ఏసీ గ్రిల్​కు మరమ్మతులు చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
ఏప్రిల్​ 25న ఉదయం మోదీ ప్రారంభించిన తర్వాత.. వందే భారత్​ రైలు తిరువనంతపురం నుంచి కాసర్​గోడ్​ బయలుదేరింది. మార్గమధ్యలో రైలు ఎగ్జిక్యూటివ్​ బోగీలోని ఏసీ గ్రిల్​లో వాటర్​ లీక్​​ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే కన్నూర్​ రైల్వే స్టేషన్​లో రైలును నిలిపివేశారు. ఐసీఎఫ్​ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)కి చెందిన సాంకేతిక నిపుణులు రైలులో తనిఖీలు చేపట్టారు. సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత రైలు కాసర్​గోడ్ చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రైలు.. కాసర్​గోడ్​ నుంచి తిరిగి తిరువనంతపురం చేరనుంది. ఇలాంటి చిన్న మరమ్మతులు జరగడం సాధారణమనేనని.. కొన్ని రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

వందేభారత్​ ఎక్స్​ప్రెస్​లకు ఇప్పటికే అనేక చోట్లప్రమాదాలు కూడా జరిగాయి. గతేడాది నవంబర్​లో గుజరాత్​లోని ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలు అహ్మదాబాద్​కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్​గా గుర్తించారు. అంతకుముందు.. అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్ పూర్తిగా దెబ్బతింది.

Last Updated : Jun 26, 2023, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details