ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లా అగౌతాలో దారుణం జరిగింది. కటింగ్ చేసేందుకు నిరాకరించాడని బార్బర్‌ను కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అతని సోదరుడి కాలిలో కూడా బుల్లెట్ దింపాడు. షారిపుర్ భైన్స్రోలిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు(bulandshahr news).
కటింగ్ చేయలేదని బార్బర్‌ను కాల్చి చంపాడు - Bulandshahr barber news
కటింగ్ చేసేందుకు నిరాకరించాడని బార్బర్‌ను కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అతని సోదురుడ్ని కూడా గాయపరిచాడు. ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది(bulandshahr news).
![కటింగ్ చేయలేదని బార్బర్‌ను కాల్చి చంపాడు Man shoots barber dead for refusing him haircut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13729860-thumbnail-3x2-img.jpg)
దారుణం.. కటింగ్ చేయలేదని బార్బర్‌ను కాల్చి చంపిన వ్యక్తి
మృతుడి పేరు ఇర్ఫాన్, నిందితుడి పేరు సమీర్ అని పోలీసులు తెలిపారు. కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన సమీర్‌ను పాత బాకీ చెల్లించాలని ఇర్ఫాన్ అడిగాడు. లేకపోతే కటింగ్ చేయనన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్ అతడిని తపాకీతో కాల్చి చంపాడు. ఇర్ఫాన్ సోదరుడ్ని కూడా గాయపరిచాడు. ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు(bulandshahr barber).
ఇదీ చదవండి:జాలరిని లక్షాధికారిని చేసిన అరుదైన చేప
Last Updated : Nov 25, 2021, 11:13 AM IST