ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యకు నిప్పంటించిన భర్త- కడుపులోని శిశువు మృతి - మహారాష్ట్ర నేర వార్తలు

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి గర్భవతి అయిన భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెకు నిప్పంటించగా.. కడుపులో పెరుగుతున్న శిశువు మృతిచెందింది. బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

fire
పైర్
author img

By

Published : Nov 2, 2021, 5:16 PM IST

మహారాష్ట్రలోని ఠాణేలో అత్యంత ఘోరం జరిగింది. మరో మహిళతో సంబంధానికి అడ్డొస్తోందని భార్యను అంతం చేయాలనుకున్నాడో కర్కశ భర్త. గర్భవతిగా ఉన్న ఆమెకు నిప్పంటించాడు.

ఇదీ జరిగింది..

ఠాణే కల్వా మఫత్‌లాల్ కాలనీకి చెందిన అనిల్ బహదూర్ చౌరాసియా అనే 35 ఏళ్ల వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. అయితే.. మరో పెళ్లి చేసుకున్న నిందితుడు.. భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే అక్టోబరు 30వ తేదీ సాయంత్రం గర్భిణి అనే కనికరం లేకుండా.. తన భార్యకు నిప్పంటించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే బాధిత మహిళ అప్పటికే తీవ్ర గాయాలపాలైంది. తన కడుపులో పెరుగుతున్న శిశువును సైతం కోల్పోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details