ఉత్తర్ప్రదేశ్లో మైనర్ బాలికను హత్య చేసిన కేసులో దోషికి పోక్సో చట్టం కింద యావజ్జీవ కారాగారం విధించింది స్థానిక కోర్టు. అంతేకాక రూ. 50వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా అదనపు జడ్జి నిర్భయ్ ప్రకాశ్.
8 ఏళ్ల బాలిక హత్య కేసులో దోషికి జీవితఖైదు
ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిదేళ్ల బాలికను హత్యచేసిన కేసులో పోక్సో చట్టం ప్రకారం దోషికి జీవిత ఖైదు విధించింది స్థానిక కోర్టు. రూ. 50వేలు జరిమానా సైతం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017లో మైనర్ బాలికను బిస్కెట్ ఆశచూపి అత్యాచారం చేసేందుకు యత్నించగా.. బాలిక కేకలు వేయటంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు.
మైనర్ బాలికను హత్య చేసిన కేసులో దోషికి జీవితఖైదు
2017, సెప్టెంబర్ 29న ఎనిమిదేళ్ల మైనర్ బాలికకు బిస్కెట్లు ఇచ్చి స్థానిక పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించగా.. బాలిక కేకలు వేయటంతో గొంతునులిమి చంపేశాడు నిందితుడు.
ఇదీ చదవండి :జేఎన్ఎంసీ రికార్డ్- 300మందికి ఓపెన్ హార్ట్ సర్జరీ