తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Man Receives Rs 753 Crore in Bank Account : సామాన్యుడి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు.. ఫ్రెండ్​కు రూ.2వేలు పంపిస్తే..

Man Receives Rs 753 Crore in Bank Account : ఫ్రెండ్​కు రూ.2 వేలు పంపిస్తే.. అతడి ఖాతాలో రూ.753కోట్లు జమ అయ్యాయి. ఈ ఆశ్చర్యకర ఘటన తమిళనాడు చెన్నైలోని కోటక్ మహీంద్రా బ్యాంక్​లో జరిగింది.

Man Receives Rs 753 Crore in Bank Account
Man Receives Rs 753 Crore in Bank Account

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 8:40 PM IST

Man Receives Rs 753 Crore in Bank Account : ఓ మందుల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా రూ. 753 కోట్ల భారీ నగదు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి.. కంగుతిని బ్యాంకు అధికారుల వద్దకు పరుగెత్తాడు. వెంటనే అతడి ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నెలో జరిగింది.

ఇదీ జరిగింది
తిరునెల్వేలికి చెందిన మహ్మాద్ ఇద్రీస్​ అనే వ్యక్తి.. పదేళ్ల క్రితం చెన్నైకి పనికోసం వచ్చాడు. తెన్నంపేట్​లో ఉంటూ అక్కడే ఉన్న ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే, శనివారం ఉదయం తనకున్న అన్నా రోడ్​లోని కోటక్​ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి స్నేహితుడికి రూ.2 వేలు పంపించాడు. వెంటనే అతడికి తన ఖాతాలో రూ.753.48 కోట్ల నగదు ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్​ను చూసిన ఇద్రీస్​.. ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే అతడి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు.

"ఉదయాన్నే ఫోన్ చూసేసరికి మీ ఖాతాలో రూ.753.48 కోట్లు ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్​ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే బ్యాంక్​ యాప్​ ఓపెన్​ చేసి చూశాను. అందులోనూ రూ.753 కోట్లు ఉన్నట్లు చూపించింది. వెంటనే అన్నా రోడ్​లో ఉన్న నా కోటక్​ మహీంద్రా బ్యాంక్​ను సంప్రదించాను. వారు సరైన వివరణ ఇవ్వకుండా.. నా బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ వాళ్లు చేసిన తప్పుకు.. నా అనుమతి లేకుండా ఖాతా ఫ్రీజ్​ చేశారు. బ్యాంక్​ కస్టమర్ కేర్ సెంటర్​ను సంప్రదించినా.. సమాధానం చెప్పకుండా ఖాతా ఫ్రీజ్​ అయ్యిందంటూ చెబుతున్నారు."

--మహ్మద్​ ఇద్రీస్​, నగదు పడిన వ్యక్తి

Cab Driver Get 9000 Crore : ఓ క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. దీంతో ఎంతో సంతోషించిన అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కలకలం రేపిన ఈ సంఘటన తమిళనాడులోని కొడంబక్కం ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tamilnad Mercantile Bank 9000 Crore : క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో రూ.9వేల కోట్లు.. వారం రోజులకే బ్యాంక్​ MD రాజీనామా

Haryana Farmer Got 200 Crore : రైతు బ్యాంక్​ ఖాతాలో రూ.200 కోట్లు జమ!.. వారి అకౌంట్లలోకి లక్షలు!

ABOUT THE AUTHOR

...view details