Man rapes woman multiple times by blackmailing her Hyderabad : మొబైల్ గేమింగ్ యాప్ పరిచయాలు ఎంత సంతోషాలను ఇస్తాయో తెలియదు గానీ.. ఎంత మంది జీవితాలను ఆగం చేస్తున్నాయో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. పబ్జీ గేమ్సో ఓ వివాహితతో పరిచయం పెంచుకున్న యువకుడు.. ఆమెతో సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టాడు. ఇది తెలిసిన భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఇదే అవకాశంగా భావించిన యువకుడు ఆమెకు.. దగ్గరై కూల్ డ్రింక్‌లో ఆల్కహాల్ కలిపి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనంతటిని వీడియో తీసి తర్వాత ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా గండేపల్లికి చెందిన ఓ యువతి సమీప గ్రామస్థుడైన వస కుమార్ నరసింహమూర్తి అనే యువకుడితో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(గతంలో పబ్జీ) ద్వారా పరిచయం ఏర్పడింది. 2020 జూన్‌లో అదే గ్రామానికి చెందిన వాలంటీర్‌తో బాధితురాలికి వివాహం జరిగింది. ఆమెకు వివాహం జరిగిన తరువాత కూడా పబ్ జీలో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నానని వేధించేవాడు. తరచూ సందేశాలు, ఫోన్లు చేస్తుండటంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యారు. క్రమంగా ఆ గొడవలు ముదిరి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
Man rapes woman in Hyderabad :భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌లోని తన స్నేహితురాలు దగ్గరికి వచ్చింది. ఇదే క్రమంలో నరసింహ మూర్తి కూడా హైదరాబాద్ వచ్చాడు. నగరానికి వచ్చిన తర్వాత మూర్తి.. మహిళను పలుమార్లు కలిశాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తను చూసి భయపడిన యువతి.. రూమ్‌లో ఉంటే సేఫ్ కాదని అమీర్‌పేటలోని ఓ హాస్టల్లోకి మారింది. గమనించిన యువకుడు ఆమె ఉంటున్న సమీపంలోని మరో హాస్టల్లో ఉండేవాడు. చివరికి ఆమెతో మాట్లాడి భర్తను వదిలేస్తే తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.