తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పక్కింటి పెంపుడు శునకంపై దారుణం.. కాళ్లు కట్టేసి అత్యాచారం - బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి

పక్కింటి పెంపుడు కుక్కపై అత్యాచారం చేశాడు ఓ మూర్ఖుడు. కాళ్లను కట్టేసి కనికరం లేకుండా మూగజీవిపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ అవమానీయ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, బాలికపై అత్యాచారం చేసి హత్యచేశాడు ఓ వ్యక్తి.

Etv neighbor raped dog
Etv కాళ్లను కట్టేసి కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి

By

Published : Nov 30, 2022, 2:40 PM IST

శునకంతో పాశవికంగా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. కుక్క కాళ్లను కట్టేసి లైంగిక దాడికి తెగబడ్డాడు. మూగ జంతువు అన్న కనికరం లేకుండా అత్యాచారం చేశాడు. పంజాబ్​ లుథియానా జిల్లాలో ఈ అవమానీయ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే..
శిమ్లాపురిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం వివాహ వేడుకకు బయటకు వెళుతూ.. తమ జెర్మన్​ షేపర్డ్​ జాతి ఆడకుక్కను ఇంట్లో వదిలి వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి కుక్కను బంధించి అత్యాచారం చేశాడు. కుక్క యజమాని మేనల్లుడు.. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అనంతరం పెళ్లి నుంచి తిరిగొచ్చిన తమ వారికి చూపించాడు.

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుక్క యజమాని.. మూగజీవాల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు ఘటనను తేలికగా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఆందోళన అనంతరం నిందితున్ని అరెస్ట్​ చేశారు. ఘటనకు పాల్పడ్డ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్​ చేస్తున్నారు.

బాలికపై అత్యాచారం.. హత్య
బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన ఛత్తీస్​గఢ్ బెమెతరలో జరిగింది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ సునీల్​ కుమార్​ అనే వ్యక్తి.. అరవకుండా బాలిక నోట్లో చున్ని కుక్కి లైంగిక దాడి చేశాడు. దాంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అనంతరం అదే చున్నితో బాలికకు ఉరి వేశాడు. మృతదేహాన్ని గమనించిన తల్లిదండ్రులు మొదట ఆత్మహత్యగా భావించారు. పోలీసుల విచారణ అనంతరం ఇది హత్యగా తేలింది. విచారణలో ఈ అఘయిత్యానికి పాల్పండింది సునీల్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు. నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడని, కేసు నమోదు చేసుకొని సునీల్​ కుమార్​ను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details