తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మందుబాబు వీరంగం.. స్కూల్​లో ఆడుకుంటున్న బాలికలపై అత్యాచారం! - మద్యం మత్తులో బాలికలపై అత్యాచారయత్నం

బిహార్​లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో పాఠశాలలో ఆడుకుంటున్న ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించాడు. ఆపై అతడి నుంచి తప్పించుకుని స్కూల్​ టాయిలెట్​లో దాక్కున్న ఓ విద్యార్థినిని అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆ బాలికకు తీవ్ర గాయాలు కాగా.. మరో చిన్నారి స్వల్ప గాయంతో కామాంధుడి నుంచి తప్పించుకుంది.

Minor girl raped by drunk man in bihar latest news
మద్యం మత్తులో బాలికలపై అత్యాచారయత్నం

By

Published : Mar 9, 2023, 2:21 PM IST

Updated : Mar 9, 2023, 3:07 PM IST

బిహార్​లోని బెగుసరాయ్​ జిల్లాలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో పాఠశాలలో ఆడుకుంటున్న ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. భయపడిన బాలికలిద్దరూ స్కూల్​ బాత్​రూమ్​లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయాలు అవ్వగా.. మరో బాలిక స్వల్ప గాయంతో అతడి నుంచి తప్పించుకుంది. అనంతరం తల్లిదండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.

పైకప్పు విరగొట్టి మరీ..
జిల్లాలోని సాహెబ్‌పుర్ కమల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు గ్రామంలోని పాఠశాల ఆవరణలో బుధవారం ఉదయం ఊయల ఊగేందుకు వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో ఉన్న ఛోటూ మహతో అనే వ్యక్తి.. ఒంటరిగా ఉన్న బాలికలను గమనించాడు. వారి దగ్గరకు వెళ్లి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో భయపడిన ఇద్దరు బాలికలు పాఠశాలలోని టాయిలెట్​లోకి వెళ్లి దాక్కున్నారు. ఇది చూసిన నిందితుడు బాత్​రూమ్​ పైకప్పును పగలగొట్టి మరీ లోపలికి వెళ్లాడు. అనంతరం ఓ బాలికపై లైంగిక దాడికి దిగాడు. కాగా, మరో అమ్మాయి ఎలాగోలా కామాంధుడి నుంచి తప్పించుకుని భయటపడింది.

ఈ క్రమంలో ఆ బాలికకు గాయమైందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ లైంగిక దాడిలో గాయపడిన ఇద్దరు బాలికలను రక్షించిన స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఒక బాలికకు తీవ్ర గాయాలయ్యాయని.. చికిత్స అందుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు ఛోటూ మహతోపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బెగుసరాయ్​ డీఎస్పీ నిశిత్​ ప్రియ తెలిపారు.

మదర్సా టాయిలెట్​లో రేప్..
గతనెల కూడా ఈ తరహా ఘటనే బిహార్​లోనే వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిని మదర్సాకు సంబంధించిన బాత్​రూమ్​లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఘటన సమయంలో బాలిక కేకలు వేయడం వల్ల ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. చిన్నారి అరుపులు విన్న ఓ వ్యక్తి టాయిలెట్​ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఇది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

శ్మశానంలో బాలికపై అఘాయిత్యం..
పంజాబ్​లోని లుథియానాలో ఓ బాలికను శ్మశానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. అనంతరం విషయాన్ని ఎవరికైనా చెబితే చెంపేస్తానని బాలికను బెదిరించారడు. అయినా బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిని 12 గంటల్లోనే అరెస్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Mar 9, 2023, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details