Man Puts Poisonous Snake In Mouth Viral Video : నూటికి 90 మంది పామును చూస్తే ఆమడ దూరం పారిపోతారు. కొందరు మాత్రం వాటినే ఓ ఆట ఆడుకుంటారు. అలాంటి ఓ మహానుభావుడి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా ఓ విషపూరిత పామును పట్టుకొని, దాన్ని మెడలో వేసుకొని.. నోట్లో కూడా పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్(Video Viral)అవుతోంది.
Man Wearing Snake around His Neck Video Viral : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. విషపూరితమైన పామును పట్టుకున్నాడు. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదుగానీ.. దానితో ఓ ఆట ఆడుకున్నాడు. ముందుగా దాన్ని తీసుకొని ఒంటి మీద వేసుకున్నాడు. కాసేపు మెడలో శివుడి మాదిరిగా వేసుకున్నాడు. తర్వాత ఆ పాము తలను పట్టుకొని ఏకంగా నోట్లో పెట్టుకోవడం.. బయటకు తీయడం.. మళ్లీ నోట్లో పెట్టుకోవడం చేశాడు. ఈ వ్యవహారమంతా మరో వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను మైక్ హోల్స్టన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ఆ పోస్ట్ కింద “One of the most venomous snakes in South America. I have so many questions but I also don’t even know what to say.” అనే క్యాప్షన్‌ను జోడించాడు. అలా పోస్ట్ చేశాడో లేదో వెంటనే తెగ వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు ఒకింత గందరగోళానికి గురయ్యారు. కొంతమంది ఆ వీడియోపై జోకులు వేయగా.. ఇంకొందరు అతని ధైర్యాన్ని ప్రశంసించారు. మరికొందరు మద్యం మత్తులో ఉన్నట్లు భావించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 87K Views వచ్చాయి.