తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాణేలతో బైక్‌ కొన్న యువకుడు- ఐదేళ్లు కష్టపడి డబ్బులు దాచుకుని.. - మహమ్మద్ సైదుల్ హాక్‌ స్కూటీ వార్తలు

బైక్‌ కొనుక్కోవడం అనేది ప్రతీ ఒక్క సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొంతమంది నెేలవారీగా చెల్లించే పద్ధతిలో బండి తీసుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం 90 వేలు కూడబెట్టి చివరికి తనకు ఇష్టమైన స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

man purchased scooter with coins in assam latest news
మహమ్మద్ సైదుల్ హాక్‌- చిల్లరతో స్కూటీని కొన్న వ్యక్తి

By

Published : Mar 22, 2023, 3:27 PM IST

Updated : Mar 22, 2023, 4:06 PM IST

నాణేలతో బైక్‌ కొన్న యువకుడు- ఐదేళ్లు కష్టపడి డబ్బులు దాచుకుని..

పూర్తిగా నాణేలు ఇచ్చి వాహనం​ కొన్నాడు మహమ్మద్ సైదుల్ హాక్‌. స్వస్థలం అసోంలోని దరంగ్‌ జిల్లా సిపజార్‌. స్కూటర్‌ కొనాలన్న తన చిరకాల కోరికను తాజాగా తీర్చుకున్నాడు. మొత్తం 90 వేల రూపాయలు విలువగల స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని అన్నీ నాణేల్లోనే చెల్లించడం ఇక్కడ విశేషం. స్కూటర్‌ కొనేందుకు గత ఐదారేళ్లుగా ఈ నాణేలను పోగేసినట్లు సైదుల్ వెల్లడించాడు.

బోరేగావ్‌ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుకునే సైదుల్‌ హాక్‌కు ఎప్పటి నుంచో ద్విచక్రవాహనాన్ని కొనాలనే కోరిక ఉంది. దీంతో రోజూ వచ్చే దానిలో కొంత దాచుకునే వాడినని తెలిపాడు. ఇన్నిరోజులుగా దాచిపెట్టిన నాణేలన్నింటినీ ఓ బస్తాలో వేసుకుని నేరుగా స్కూటర్‌ షోరూంకు చేరుకున్నాడు. చివరికి స్కూటర్‌ను కొనుగోలు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.

మహమ్మద్ సైదుల్ హాక్‌​ జమ చేసిన నాణేలు
కాయిన్స్​ను సంచిలో షోరూమ్​కు తీసుకొస్తున్న సైదుల్

నాణేలతో స్కూటర్‌ కొన్న వినియోగదారుడి పట్ల షోరూం యజమాని ఆనందం వ్యక్తం చేశారు. 90 వేల రూపాయలు విలువగల స్కూటర్‌ను నాణేలతో కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడని సిబ్బంది చెప్పడం వల్ల తాను ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించాడు. ఇలాంటివి తాను టీవీల్లో చూశానని తెలిపాడు. ఇదే విధంగా భవిష్యత్‌లో సైదుల్ కారు కొనుగోలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

షోరూమ్​ సిబ్బందితో కలిసి చిల్లరను లెక్కిస్తున్న సైదుల్
మహమ్మద్ సైదుల్ హాక్‌- చిల్లరతో స్కూటీని కొన్న వ్యక్తి

రూపాయి కాయిన్స్​తో స్పోర్ట్స్​ బైక్​..
కొంతకాలం క్రితం తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.2.85 లక్షలు ఖర్చు చేసి కేటీఎమ్​ బైక్​ను కొన్నాడు. దాంట్లో వింతేముంది అంటారా.. కొన్నది ఓ ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​ ద్వారా సంపాదించిన సొమ్ముతో మరి. అందరిలాగా కాకుండా వెరైటీగా రూపాయి చిల్లరతో వాహనాన్ని కొనాలని నిశ్చయించుకున్నాడు. ఆ విధంగానే రూపాయి నాణేలను పోగు చేసి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్​ బైక్​ కొనాలనే కోరికను తీర్చుకున్నాడు. మంచిర్యాలకు చెందిన ఈ యువకుడు ఆన్​లైన్​లో ఓ గేమింగ్​ ఛానల్​ను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా సంపాదించిన మొత్తంతో బైక్​ను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

రూ.10 నాణేం చెల్లట్లేదని పుకారు.. కారు కొని..
గతేడాది జూన్​లో రూ.10 నాణేలు చెల్లవని తమిళనాడులోని సేలం జిల్లా ధర్మపురిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దుకాణదారులు.. కస్టమర్​ల నుంచి పది రూపాయల నాణేలను తీసుకోవడానికి అంగీకరించలేదు. రూ.10 నాణేలు చెల్లట్లేదన్న వదంతును ఆపేందుకు ఆరూరుకు చెందిన వెట్రివేల్ వినూత్నంగా ఆలోచించాడు. రూ.10 నాణేలను మాత్రమే సేకరించి వాటితోనే కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంట్లో భాగంగానే దేవాలయాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, రోడ్డు పక్కన ఉండే షాపులు వంటి వివిధ ప్రదేశాలకు వెళ్లి రూ.10 నాణేలను సంపాదించాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత రూ.పది నాణేలను మూటలుగా కట్టి భద్రపరిచాడు. అనంతరం కారును కొనేందుకు సేలంలోని షోరూమ్​కు వెళ్లాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​చేయండి.

Last Updated : Mar 22, 2023, 4:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details