Man Pulled Woman's clothes on the road Hyderabad : స్త్రీ.. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై నిర్భయంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు, పరిస్థితులను చూస్తే గాంధీ చెప్పిన స్వాతంత్ర్యం మనకింకా వచ్చినట్లుగా కనిపించడం లేదు. అర్ధరాత్రి కాదు కదా.. పట్టపగలు కూడా మహిళ ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతుంది. రోజురోజుకూ పెరుగుతున్న కామాంధుల నుంచి తనను తాను కాపాడుకోలేకపోతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా ఈ క్రూరులు మాత్రం మారడం లేదు. అప్పుడెప్పుడో జరిగిన నిర్భయ ఘటన మొదలుకుని.. ఇటీవలి కాలంలో చటాన్‌పల్లి 'దిశ' వరకు నిందితులను ఎన్కౌంటర్, ఉరి శిక్షలతో శిక్షించినా అవి సమాజంలో పెద్దగా మార్పు తీసుకురాలేకపోయాయనే చెప్పొచ్చు. మణిపూర్ ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. దాదాపు ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో ఆదివారం వెలుగు చూసింది. సికింద్రాబాద్ జవహర్‌నగర్ బస్‌స్టాప్ వద్ద పూటుగా మద్యం తాగిన ఓ కీచకుడు అటుగా వెళ్తున్న ఓ యువతిని వివస్త్రను చేసి అమానుషంగా ప్రవర్తించాడు.
Young Man made Young Woman Naked in Secunderabad : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద మారయ్య అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జవహర్‌నగర్‌లో జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన మారయ్య.. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక యువతి దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య.. యువతిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితురాలు.. మారయ్యపై కోప్పడి దూరంగా నెట్టేసింది. దాంతో విచక్షణ కోల్పోయిన మారయ్య మరింత రెచ్చిపోయాడు. యువతి బట్టలను చించేసి, వివస్త్రను చేసి కర్కషత్వాన్ని ప్రదర్శించాడు. పక్కనే ఉన్న అతడి తల్లి ఈ దారుణాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.