తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైకోర్టు న్యాయమూర్తి అంటూ పోలీసులకు ఫోన్​.. రూ.5 లక్షల డిమాండ్​.. చివరకు..

హైకోర్టు న్యాయమూర్తినంటూ పోలీసు అధికారినే నమ్మించాడు ఓ వ్యక్తి. కేసును రద్దు చేస్తానని చెప్పి స్టేషన్​కు వచ్చి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని బెదిరించాడు. కానీ చివరకు ఏమైందంటే?

By

Published : Dec 17, 2022, 5:34 PM IST

Man posing as High Court judge arrested
Man posing as High Court judge arrested

దిల్లీకు చెందిన ఓ వ్యక్తి తాను హైకోర్టు న్యాయమూర్తినని నమ్మించి పోలీసు అధికారిని మోసం చేయాలనుకున్నాడు. ఓ కేసును రద్దు చేస్తానని చెప్పి డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించాడు. చివరికు కటకటాల పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 16న నరేంద్ర కుమార్ అగర్వాల్ అనే ఓ వ్యక్తి.. సమయపుర్ బద్లీ సబ్‌డివిజన్‌ ఏసీపీ అనురాగ్ ద్వివేదికి వాట్సాప్​లో మెసేజ్​ పంపాడు. తాను హైకోర్టు న్యాయమూర్తినని, వెంటనే తనకు ఫోన్ చేయాల్సిందిగా మెసేజ్‌ చేశాడు. అయితే పోలీసు అధికారులు సదరు వ్యక్తికి కాల్ చేయగా ఓ కేసు విషయమై తాను పోలీస్​స్టేషన్​కు వస్తున్నట్లు తెలిపాడు.

60-65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆ వ్యక్తి స్టేషన్​కు వచ్చి తాను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకున్నాడు. పోలీస్​స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై వ్యక్తిగత పరిశీలన నిమిత్తం అక్కడికి వచ్చినట్లు తెలిపాడు. కేసును రద్దు చేసేందుకు రూ.5 లక్షలు చెల్లించాలని స్టేషన్​​ ఆఫీసర్​ను డిమాండ్​ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకుంటే ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని బెదిరించాడు.

అయితే అతడిపై స్టేషన్​ ఆఫీసర్​కు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి నకిలీ హైకోర్టు న్యాయమూర్తిగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇదివరకే పలుచోట్ల ఈ విధంగా అతడు మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నరేంద్ర కుమార్​ అగర్వాల్​

ABOUT THE AUTHOR

...view details