తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గిరిజనుడిపై చిరుత దాడి.. పదునైన కత్తితో హతమార్చి.. - కేరళ ఇడుక్కి న్యూస్

Man Kills Leopard: చిరుత పులి దాడి చేయగా గాయాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆత్మరక్షణ కోసం చిరుతను హతమార్చాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

Man Kills Leopard
గిరిజనుడిపై చిరుత దాడి

By

Published : Sep 3, 2022, 5:16 PM IST

Updated : Sep 3, 2022, 5:48 PM IST

ఆత్మరక్షణలో చిరుతను చంపిన వ్యక్తి

Man Kills Leopard: కేరళ ఇడుక్కిలో చిరుత పులి.. గోపాలన్ అనే గిరిజనుడిపై దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం చిరుతను పదునైన కత్తితో దాడి చేసి హతమార్చాడు గోపాలన్. అయితే చిరుత కూడా గోపాలన్​ను​ గాయపరిచింది. దీంతో కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం ఉదయం చింగనంకుడిలో జరిగింది. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని తరలించారు.

అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి చిరుత.. ఫిఫ్టీ మైల్స్ అనే ప్రాంతంలో సంచరించి రెండు మేకలను చంపేసింది. గత కొన్ని రోజులుగా మంకులం ప్రాంతంలోనూ చిరుత సంచరిస్తోంది. దీంతో అటవీ అధికారులు ఆ ప్రాంతంలో కెమెరాలు అమర్చారు. కెమెరాలో చిరుత పులి సంచరించిన దృశ్యాలు నమోదవ్వగా దానిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే గోపాలన్​పై దాడి చేసిందా క్రూరమృగం. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపిన గోపాలన్​పై చట్టపరమైన చర్యలు ఉండవని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. గోపాలన్​పై కేసు నమోదు చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

Last Updated : Sep 3, 2022, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details