Father raped daughter: మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో ఓ అమానవీయ ఘటన జరిగింది. 14 సంవత్సరాలున్న తన కన్న కూతురినే హత్య చేశాడు ఓ కర్కశ తండ్రి. అంతటితో ఆగక ఆమె మృతదేహంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడా కామాంధుడు. బాలికను అడవికి తీసుకెళ్లి ఈ దురాఘాతానికి ఒడిగట్టినట్లు పోలీసులు వివరించారు.
బాలిక మిస్సింగ్ అంటూ ఫిర్యాదు..
బాలికపై అఘాయిత్యం చేసిన ఆ వ్యక్తి.. ఏమీ ఎరగనట్లు కూతురు తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించారు. అయితే వారి నుంచి ఒకే సమాధానం వచ్చింది. అమ్మాయి చివరగా ఆమె తండ్రితోనే కనిపించిందని చెప్పారు. ఇక పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడ్ని గట్టిగా విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు. 'తానే అడవిలోకి తీసుకెళ్లి తొలుత అత్యాచారం చేసేందుకు యత్నించానని.. ఆపై చంపి అఘాయిత్యానికి పాల్పడ్డానని' తెలిపాడు.