Man killed teen in maharashtra: తాను ప్రేమించిన యువతితో మరొక యువకుడు చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
థానే జిల్లాలోని బందర్పడాకు చెందిన కల్యాణ్ ప్రాంతానికి చెందిన యాసిన్ షేక్ ఇమ్రాన్(20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆమెతో అర్మాన్ సయ్యిద్(16) చనువుగా ఉంటున్నాడు. యువతి విషయంలో ఇది వరకే ఇమ్రాన్, సయ్యిద్ మధ్య చాలాసార్లు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో సయ్యిద్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన ఇమ్రాన్.. మాయమాటలు చెప్పి సయ్యిద్ను పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడే కిరాతకంగా కొడవలితో నరికి చంపాడు.