తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో గొడవ.. భార్యాపిల్లల్ని దహనం చేసిన భర్త - భార్యను కాల్చి చంపిన భర్త

బిహార్​లోని కటిహార్​ జిల్లాలో భార్యతో పాటు పిల్లలను సజీవదహనం చేశాడో కిరాతక భర్త. నిందితుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన గొడవే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు వివరించారు.

Bihar man sets wife, kids ablaze in Katihar
భార్యాపిల్లల్ని మంటల్లో కాల్చివేసిన భర్త

By

Published : Mar 25, 2021, 6:41 PM IST

కుటుంబ గొడవల కారణంగా తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి నిప్పంటించాడో వ్యక్తి. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన బిహార్​లోని కటిహార్ జిల్లాలో జరిగింది. నిందితుడిని మొహమ్మద్​ తాహిర్​గా గుర్తించారు పోలీసులు.

కిరోసిన్​ పోసి..

పట్నాకు సమీపంలోని లాభా గ్రామానికి చెందిన మొహమ్మద్ తాహిర్​కు, అతని భార్యకు మధ్య గురువారం గొడవ జరగింది. కోపంలో ఉన్న తాహిర్ ఉదయం 11 గంటల ప్రాంతంలో భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. మంటల్లో కాలిపోతున్న వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు యత్నించిన తాహిర్​ను పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.. పోలీసులకు అప్పగించారు.

తాహిర్ తరచూ తన భార్యతో గొడవపడి కొట్టేవాడని.. ఆపడానికి ప్రయత్నించిన వారిని అసభ్య పదజాలంతో దూషించేవాడని గ్రామస్థులు చెప్పారు.

ఇదీ చదవండి:మహిళ గర్భాశయంలో సూది వదిలేసిన వైద్యులు!

ABOUT THE AUTHOR

...view details