తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముందుగా ఎవరు చనిపోతారని పందెం.. ఫ్రెండ్​ను రైలు కిందకు తోసేసి హత్య - మైనర్​ బాలికపై అత్యాచారం హత్య చేసిన బాలుడు

స్నేహితుడిని రైలు కిందకు తోసేసి చంపిన ఘటన హరియాణాలో జరిగింది. మద్యం మత్తులో, ముందుగా ఎవరు చనిపోతారని పందెం కాసిన ఇద్దరు స్నేహితుల్లో.. ఓ వ్యక్తి మరో వ్యక్తిని ఇలా హత్య చేశాడు.

man killed his friend by pushing him on a train
స్నేహితుడిని రైలు మీదకు తోసేసి చంపిన వ్యక్తి

By

Published : Dec 1, 2022, 3:42 PM IST

Updated : Dec 1, 2022, 5:28 PM IST

హరియాణాలో ఓ సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు.. ముందుగా ఎవరు చనిపోతారని పందెం​ వేసుకున్నారు. అనంతరం ఇద్దరు రైల్వే ట్రాక్​ దగ్గరకు చేరుకోగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని రైలు కిందకు తోసేసి హత్య చేశాడు. సోనీపత్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. జట్వాడా గ్రామానికి చెందిన మనూ, ముఖేశ్​ స్నేహితులు. ఇద్దరూ కలసి నగరంలో దుప్పట్లు అమ్మేవారు. రాత్రి విపరీతంగా మద్యం తాగిన వారిద్దరూ.. ఆ మత్తులో ఎవరు ముందుగా చనిపోతారని పందెం వేసుకున్నారు. అనంతరం ముఖేశ్​ సోదరి ఇంట్లో భోజనం చేసి.. నేరుగా రైల్వే ట్రాక్​ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో రైలు రాగా.. దాని ముందుకు మఖేశ్​ను​ తోసేశాడు మనూ. దీంతో ముఖేశ్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనను చూసిన కొందరు వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

బాలికపై అత్యాచారం, హత్య:
ఓ వ్యక్తి కొట్టాడని, అతని 9 ఏళ్ల​ కూతురిని అత్యాచారం చేసి హత్య చేశాడు 15 ఏళ్ల బాలుడు. మహారాష్ట్ర ఠాణేలో ఈ దారుణం జరిగింది. బాలిక తండ్రిపై పగ పెంచుకున్న బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొదట బాలికను తీవ్రంగా హింసించిన అనంతరం అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేశాడు.

"గురువారం ఉదయం కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని హౌసింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ బాలిక మృతదేహం ఉందని సమాచారం అందుకున్నాం. ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గంట వ్యవధిలోనే కేసును చేధించాం. నిందితుడిని మహాత్మా ఫూలే చౌక్ పోలీసు స్టేషన్‌కు తరలించాం. అతడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం." అని పోలీసులు తెలిపారు.

Last Updated : Dec 1, 2022, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details