తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆమెకు ఆరుగురు పిల్లలు, తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడితో ప్రేమ, పెళ్లికి నో చెప్పాడని చున్నీతో హత్య - ఆటోడ్రైవర్​ను చంపిన మహిళ

ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు, భార్యతో పాటు కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. ఉత్తరాఖండ్​లోని డోయ్​వాలాలో జరిగిందీ ఘటన. మరోవైపు, మహారాష్టలోని పెళ్లి నిరాకరించడానికి ఆటోడ్రైవర్​ను ఓ మహిళ తన చున్నీతో గొంతు నులిపి చంపేసింది.

man killed his five family members in uttarakhand
man killed his five family members in uttarakhand

By

Published : Aug 29, 2022, 9:28 AM IST

Updated : Aug 29, 2022, 10:31 AM IST

ఉత్తరాఖండ్​లోని డోయ్​వాలాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను, భార్యతో పాటు కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన మహేశ్​.. ఉత్తరాఖండ్​ డోయ్​వాలా జిల్లాలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ముగ్గురు పిల్లలు తన దగ్గరే ఉండగా మరో బాలిక అమ్మమ్మగారింట్లో ఉంటుంది. మహేశ్​ తన ముగ్గురు పిల్లలు, భార్య, తల్లిను చంపేశాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన మహేశ్​ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్షల నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెళ్లికి నిరాకరించాడని ఆటో డ్రైవర్​ హత్య
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఆటో డ్రైవర్​ను ఓ మహిళ తన చున్నీతో గొంతు నులిపి హత్య చేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. ముంబయిలోని పొవాయ్​ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన ఆరుగురు పిల్లలతో నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఆటో డ్రైవర్​తో ప్రేమలో పడింది. కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా తనను వివాహం చేసుకోమని మహిళ.. యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు అతడు నిరాకరించాడు.

అది తట్టుకోలేని మహిళ.. శనివారం ఇద్దరూ కలిపి ఆటోలో మార్కెట్​కు వెళ్తున్న సమయంలో తన చున్నీతో అతడి గొంతు నులిపి చంపేసింది. హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైడింగ్ సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

భార్య, కుమార్తెపై కత్తితో దాడి..
దిల్లీలోని మయార్​ విహార్​లో నివాసం ఉంటున్న సిద్ధార్థ్​ అనే ఇంజినీర్​.. తన భార్య, కుమార్తెతో పాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. గాయపడిన వారిని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల నారాయణ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి ప్రాథమికంగా వివాహేతర విభేదాలే కారణమని భావిస్తున్నట్లు డీసీపీ ప్రియాంక కశ్యప్ చెప్పారు.

ఇవీ చదవండి:భారత్​లో మరింత తగ్గిన కరోనా కేసులు, జపాన్​లో పెరిగిన మరణాలు

ట్విన్ టవర్స్​ కథ అయిపోలేదు, అదే అసలు సవాల్, ఇంకా అనేక నెలలపాటు

Last Updated : Aug 29, 2022, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details