Man Killed for Pushing Customer: మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. తనను నెట్టివేశాడని ఓ యువకుడిని అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి.
ఇదీ జరిగింది..
Man Killed for Pushing Customer: మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. తనను నెట్టివేశాడని ఓ యువకుడిని అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి.
ఇదీ జరిగింది..
రాజేశ్ భలోతియా అనే 23 ఏళ్ల యువకుడు.. మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా.. రాజేశ్ వాఘ్మరే అనే వ్యక్తిని పక్కకు జరగమనే ఉద్దేశంతో కాస్త నెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన వాఘ్మరే.. భలోతియాను అక్కడికక్కడే రాడ్డుతో తలపై మోదాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై షాప్ ఓనర్.. పోలీసులకు సమాచారం అందించారు.
భలోతియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. నిందితుడు వాఘ్మరేను పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:'పిల్లలు, మహిళల్ని చేతులు కట్టేసి కొట్టిన పోలీసులు!'