కన్న తండ్రిని పొడిచి చంపాడో వ్యక్తి. అనంతరం సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. టామ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..65 తండ్రిని 20 ఏళ్ల కొడుకు పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. నిందితుడి తండ్రి, సవతి తల్లి కలిసి సొంతూరులో ఉంటున్నారు. కొడుకు తన తండ్రితో కలిసి ఉండేందుకు సవతి తల్లి ఒప్పుకోలేదు. దీంతో నిందితుడు ఒంటరిగా మరో గ్రామంలో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి నిందితుడు.. తన తండ్రి ఇంటికి వెళ్లాడు. సవతి తల్లి పట్ల మూర్ఖంగా ప్రవర్తించాడు. తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. భార్యకు మద్ధతుగా మాట్లాడాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో తండ్రిపై కోపంతో ఓ పదునైన ఆయధంతో అతడిని నరికాడు కొడుకు. తీవ్ర గాయాలతో నిందితుడి తండ్రి మరణించాడు. అనంతరం సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. నిందితుడిని సోమవారం పట్టుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.