తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడవి ఏనుగు చేతిలో మరొకరు బలి.. 15 రోజుల్లో ఏడుగురు! - బంగాల్​ వార్తలు

కట్టెల కోసం చెట్లు నరుకుతున్న ఓ వ్యక్తిని అడవి ఏనుగు తొక్కి చంపేసింది. ఈ విషాద ఘటన బంగాల్​లో జరిగింది. 15 రోజుల వ్యవధిలో అడవి ఏనుగుల దాడిలో ఏడుగురు ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు.

elephant attack
elephant attack

By

Published : Sep 7, 2022, 3:51 PM IST

Wild Elephant Killed Man: బంగాల్​లోని జార్​గ్రామ్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెట్టును నరుకుతున్న ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది అడవి ఏనుగు. బాధితుడ్ని పరిమల్​పాల్​గా గుర్తించారు అధికారులు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని బద్​గోరా పంచాయతీ పరిధిలోని కిస్మత్​- జంబేడా గ్రామంలో పరిమల్​ పాల్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. కట్టెలు కావాలని బుధవారం ఉదయం.. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. చెట్లను నరుకుతున్న సమయంలో ఓ అడవిఏనుగు.. అతడిపై బలంగా దాడి చేసింది. అనంతరం తొక్కి చంపేసింది.

అది గమనించిన అటవీ సిబ్బంది.. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు. అయితే జిల్లాలోని గత 15 రోజుల్లో అడవి ఏనుగుల దాడిలో ఏడుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details