Man Killed by Parents: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే.. కొడుకును హత్య చేశారు. తర్వాత కాళ్లు చేతులు కట్టేసి నదిలో విసిరేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
అసలేమైందంటే..?
బుర్హాన్‌పుర్ జిల్లాలోని ధౌల్కోట్ గ్రామానికి చెందిన రామకృష్ణ సింగ్ అనే యువకుడికి ఇటీవల నిశ్చితార్థం అయింది. అయినప్పటికీ మరో యువతితో చాటింగ్ చేసేవాడు. అంతే కాకుండా నిరుద్యోగి అయిన అతడు ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడపడేవాడు. ఇదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఎప్పుడూ ఫోన్‌తోనే కనిపించడం కుటుంబ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇదే విషయమై రామకృష్ణ, తల్లిదండ్రులు, సోదరి మధ్య జనవరి 2న గొడవ జరిగింది. ఈ క్రమంలో తండ్రి.. రామకృష్ణను నెట్టాడు. దీంతో తల గోడకు గట్టిగా తగిలింది. ఆ యువకుడు మృతి చెందాడని భావించారు.
దీన్ని కప్పిపుచ్చేందుకు రామకృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేశారు కుటుంబ సభ్యులు. మూడు రోజుల(జనవరి 5) తర్వాత అటవీ విశ్రాంతి భవనం సమీపంలో ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్ ఫోన్‌ల లొకేషన్లను గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా.. కుటుంబ సభ్యులే రామకృష్ణను హత్య చేసినట్లు తేలిందని అధికారులు తెలిపారు.
కుటుంబ కలహాలకు చిన్నారి బలి
Daughter Killed by Father: అనుప్పుర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఓ బాలిక నిండు ప్రాణం బలిగొన్నాయి. కన్న తండ్రే.. తొమ్మిదేళ్ల బాలికను హత్యచేశాడు.
బార్గే గ్రామానికి చెందిన ఆనంద్రామ్ మారవి(45).. తన మరదలను తన వద్దే ఉంచుకోవాలనే ఆలోచనకు అతని భార్య, సోదరుడు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన మారవి.. తన తొమ్మిదేళ్ల కూమార్తెను సమీపంలో అడవిలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత బిడ్డ మృతదేహాన్ని శాలువాలో చుట్టి రాజేంద్రగ్రామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
జొమాటో డెలివరీ బాయ్‌పై కాల్పులు
జొమాటో డెలివరీ బాయ్‌ని కాల్చి చంపిన ఘటన హరియాణాలో రేవారి జిల్లాలో వెలుగుచూసింది. ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళ్తున్న డెలివరీ బాయ్‌పై.. అన్సల్లో సెక్టార్ 19 వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో బాధితుడు గాయపడగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు.. అతడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
Zomato Delivery Boy Death: డెలివరీ బాయ్ మొబైల్, వాలెట్ కనిపించకుండా పోవడంతో దోచుకోవాలనే ఉద్దేశంతో నిందితుడు కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఫ్రెండ్స్‌తో కలిసి భార్యను రేప్ చేసిన నిందితుడి ఫాంహౌస్ కూల్చివేత