ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ దుర్ఘటన గురువారం రాత్రి జరిగిందని.. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి తమకు సమాచారం అందించారని పోలీసులు వెల్లడించారు. మృతులు.. శంకర్ రామ్ (55), సువా (28), ఘుడి(15)గా గుర్తించారు.
చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రీకూతుళ్లు.. ఏమైంది? - కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.
d
అదే కారణం?..: కుటుంబకలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఘటనకు ముందు ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగి ఉంటుందని.. మనస్తాపం చెందిన వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు. అయితే వారి మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చూడండి :అగ్నిపథ్‌పై నిరసనలతో టెన్షన్ టెన్షన్.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు