సైన్యానికి చెందిన కీలక సమాచారాన్ని విదేశీ గూఢచారి సంస్థలకు అప్పగించినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు. అతన్ని పంజాబ్లోని తరన్తారన్ జిల్లాకు చెందిన హర్పాల్ సింగ్(35)గా గుర్తించారు.
గూఢచర్యం కేసులో ఒకరు అరెస్ట్ - indian army information
సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశీ నిఘా సంస్థకు చేరవేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సమాచారాన్ని చేరవేసేందుకు హవాల ద్వారా డబ్బు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గూఢచర్యం
సైనిక సిబ్బంది వివరాలు, సైన్యం కదలికలు, పాక్ సరిహద్దులో ఆర్మీ, బీఎస్ఎఫ్ పోస్టులు, బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు హవాలా మార్గంలో అతనికి సొమ్ము ముట్టిందని పేర్కొన్నారు. పాక్ సరిహద్దుల్లో చేపట్టిన ఇనుప కంచె పనుల్లో పాల్గొని ఈ సమాచారం సేకరించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కరోనా విజృంభణపై ప్రధాని మోదీ సమీక్ష