ఉద్యోగం నుంచి తీసేసి, ఇంటి నుంచి పంపించేయాలని భర్తకు చెప్పిందనే కోపంతో తన యజమాని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు వారి కారు డ్రైవర్. ఆ తర్వాత ఆమెకు కరెంట్ షాక్ పెట్టాడు. ఈ దారుణ ఘటన దిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..

దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వీరేందర్ కుమార్‌కు మూడేళ్ల క్రితం రాకేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే అతనికి డ్రైవర్‌గా ఉద్యోగం ఇచ్చారు కుమార్. తన ఇంటిపై పెంట్ హౌజ్‌లో ఉండేందుకు చోటు కల్పించాడు. కొద్ది రోజులుగా డ్రైవర్‌కు జీతం చెల్లించటంలో ఆలస్యం చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు చెల్లించాలని, పూర్తిగా ఒకేసారి ఇవ్వాలని రాకేశ్ డిమాండ్ చేశాడు. ఇందుకు నిరాకరించిన యజమాని భార్య పంకీ.. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని భర్తకు చెప్పింది. ఇంటి నుంచి పంపించేయాలని కోరింది. ఈ విషయంపై కోపం పెంచుకున్నాడు రాకేశ్.
వీరేందర్ తన తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకుని గత సోమవారం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వీరేందర్ భార్య పింకీపై దాడి చేశాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై విద్యుత్ షాక్‌కు గురి చేశాడు. అనంతరం.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసిట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:యూపీలో జికా విజృంభణ.. 100 దాటిన కేసులు