విమానం గాల్లో ఉన్నప్పుడ ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. విమానం అత్యవసర ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అయితే విమాన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. పెద్ద ప్రమాదమం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
విమాన అత్యవసర ద్వారం తెరవబోయిన ప్రయాణికుడు! - దిల్లీ
విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవస ద్వారం తీయడానికి ప్రయత్నించాడు. అయితే విమాన సిబ్బంది వచ్చి అతన్ని అడ్డుకున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటన దిల్లీనుంచి వారణాసికి వెళుతున్న విమానంలో జరిగింది. విమానంలో 89 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రయాణికుడు
89 మంది ప్రయాణికులతో ఎస్జీ-2003 విమానం దిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయణికుడు అత్యవసర ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ఆ ప్రయాణికుడికి మానసిక పరిస్థతి సరిగా లేదని పోలీసులు అన్నారు.
ఇదీ చదవండి:భాజపా ఎమ్మెల్యేపై రైతుల దాడి