మూడు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో బారికేడ్లను కారుతో వేగంగా ఢీకొట్టి ధ్వంసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి..
"తొలుత ఆంధ్రప్రదేశ్ చింటూరులో ఆ వ్యక్తి బారికేడ్ను ధ్వంసం చేశాడు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్లాడని సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందింది. ఆ వివరాల ఆధారంగా సుక్మా జిల్లాలో నిందితుడిని అరెస్టు చేశాము" అని వివరించారు సుక్మా ఏఎస్పీ సచీంద్ర చౌబే.
బారికేడ్లను ధ్వంసం చేసి వెళ్తున్న కారు 9 ప్రాంతాల్లో..
నిందితుడిని మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన హనుమాన్ మోహిత్గా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని 9 ప్రాంతాల్లో అతడు బారికేడ్లను ధ్వంసం చేశాడని చెప్పారు. చింటూరు(ఆంధ్రప్రదేశ్), మోటు(ఒడిశా) సరిహద్దుల్లో బారికేడ్లను ఢీకొట్టి.. ఛత్తీస్ఢ్లోని దోర్నపల్ చెక్పోస్టును అతడు దాటి వెళ్లాడని పేర్కొన్నారు. అనంతరం.. ఎర్రబోరమ్, ఇంజ్రామ్ చెక్పోస్టులనూ ధ్వంసం చేశాడని చెప్పారు.
కారు ఢీకొనగా.. గాయపడ్డ పోలీసు సిబ్బంది సుక్మాలో నిందితుడు తన కారుతో పోలీసు సిబ్బందిని ఢీ కొట్టేందు యత్నించాడు. ఈ క్రమంలో ఓ జవాను గాయపడగా.. నిందితుడిపైకి కాల్పులు జరిపాడు. తూటా తగిలి గాయపడిన అతడిని అదుపులోకి తీసుకుని, కోంటాలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు
ఇదీ చూడండి:మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు వారికి కేంద్రం అనుమతి