కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న ఓ యువకుడికి.. కొన్ని నిమిషాల్లోనే మరొకటి వేశారు (two doses of covishield) వైద్య సిబ్బంది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం జరిగింది. యువకుడి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు.
కూటేలు గ్రామానికి చెందిన కేబీ అరుణ్.. టీకా తీసుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడి సిబ్బంది అరుణ్‌కు కొవిషీల్డ్ తొలి డోసును ఇచ్చారు. టీకా తీసుకున్న అరుణ్.. అక్కడే ఉన్న వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నాడు. అరుణ్‌ను గుర్తించని అక్కడి సిబ్బంది అతనికి మరోసారి టీకా వేశారు. ఓ వ్యక్తికి రెండుసార్లు టీకా వేశామని తెలుసుకున్న సిబ్బంది.. అరుణ్‌ను మూడు గంటల పాటు పర్యవేక్షించి ఇంటికి పంపించారు.