తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నకూతురిపై అత్యాచారం.. నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష

RAPE CONVICTION: కేరళలోని ఓ అత్యాచార నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. ప్రత్యేక ఫాస్ట్​ ట్రాక్​ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంతేగాకుండా రూ.17 లక్షలు జరిమానా కూడా విధించింది. మైనర్​ అయిన తన కుమార్తెపై నిందితుడు పలుమార్లు అత్యాచారం పాల్పడిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.

కన్న కుమార్తెపై అత్యాచారం..నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష..
కన్న కుమార్తెపై అత్యాచారం..నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష..

By

Published : May 11, 2022, 7:08 AM IST

RAPE CONVICTION: కేరళలో అత్యాచార నిందితుడికి ​ప్రత్యేక ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన కుమార్తెపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. అంతే గాకుండా రూ.17 లక్షల జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. మైనర్‌పై పదేపదే అత్యాచారం చేసినందుకు, ఆమెను గర్భవతిని చేసినందుకు, 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడినందుకు, పోక్సో చట్టం కింద అడిషనల్ సెషన్స్ జడ్జి ఉదయకుమార్ నిందితుడికి జైలు శిక్ష విధించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. 2017లో మైనర్​ గర్భం దాల్చినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని మొదట నిందితుడి గురించి అడిగితే ఎటువంటి వివరాలు చెప్పలేదు. ఆ తర్వాత కౌన్సిలింగ్​కు హాజరైన బాలిక.. తన తల్లి ఇంట్లో లేని సమయంలో తండ్రి అత్యాచారం చేశాడని తెలిపింది. జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పాడని బాధితురాలు తెలిపింది. 2017లోనే మైనర్​ తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు బెయిల్​ కోసం అభ్యర్థించుకున్నా.. నిందితుడికి బెయిల్ దక్కలేదు. బాధితురాలికి పుట్టిన బిడ్డ డీఎన్​ఏ టెస్టు ఆధారంగా.. కోర్టు బాలిక తండ్రిని దోషిగా నిర్ధరించింది. బాధితురాలికి జన్మించిన బిడ్డను సీడబ్య్లూసీ దత్తత తీసుకుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details