తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ కొండచిలువను పట్టి.. తాడుతో కట్టేసి.. - ఒడిశా సంబల్‌పూర్ జిల్లా వార్తలు

ఇంటి సమీపంలోకి వచ్చిన ఓ కొండచిలువ హాని చేస్తుందని భావించిన ఓ వ్యక్తి దాన్ని తాడుతో కట్టేశాడు. ఒడిశా సంబల్‌పూర్‌ జిల్లా తల్పాలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాన్ని రక్షించి సమీపంలోని అడవిలో వదిలేశారు.

python
కొండచిలువ

By

Published : Oct 24, 2021, 7:57 PM IST

కొండచిలువను పట్టి.. తాడుతో కట్టి బంధించి..

ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలోని తల్పాలి గ్రామంలో భారీ కొండచిలువను గ్రామస్థులు తాడుతో కట్టేశారు. ఓ వ్యక్తి ఇంటి వెనుక కాలువ సమీపంలో తిరుగుతున్న కొండచిలువను స్థానికులు గమనించి పట్టుకున్నారు. అప్రమత్తమైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం తెలిపారు.

తాడుతో కట్టేసిన వ్యక్తి

అయితే అధికారులు వచ్చే వరకు ప్రజల భద్రత కోసం కొండచిలువను తాడుతో కట్టేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పామును రక్షించి అడవిలో వదిలారు. ఈ క్రమంలో భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.

కొండచిలువ తాడుతో బంధించిన దృశ్యం
తాడుతో కట్టేసిన స్థితిలో కొండచిలువ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details