Omicron Variant in India: ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను కలవర పరుస్తోంది. ఈ సమయంలో మహారాష్ట్ర ఠాణే జిల్లా డోంబివలీలో నమోదైన ఓ కరోనా కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. వైరస్ సోకిన వ్యక్తి ఈనెల 24న దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రావడమే అందుకు కారణం. రోగికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా- 'ఒమిక్రాన్' అని అనుమానం!
ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant in India) భారత్లో కూడా వ్యాపించిందా? ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహారాష్ట్ర వాసికి కరోనా పాజిటివ్ రావడం వల్ల వ్యక్తమవుతున్న సందేహాం ఇది. అయితే ఒమిక్రాన్ సోకిన విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదంటున్నారు అధికారులు.
కరోనా అలర్ట్- భారత్లో ఒమిక్రాన్ వేరియంట్!
అయితే అతనికి సోకింది ఒమిక్రామ్ వేరియంటా? కాదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత బాధితుడు ఇప్పటివరకు ఎవరినీ కలవలేదని తెలిపారు. ప్రస్తుతం అతను ఆర్ట్ గ్యాలరీ ఐసొలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడని.. ఒకవేళ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చూడండి :వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం