తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దెయ్యాలు నన్ను చంపేస్తాయి.. కాపాడండి ప్లీజ్​' - గుజరాత్​లో దెయ్యాల అలజడి

గుజరాత్​లో ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వింటే ఆశ్యర్యపోవాల్సిందే. తనను రెండు దెయ్యాలు చంపేస్తామని బెదిరిస్తున్నాయని.. అందులో అతను వాపోయాడు. ఆ వ్యక్తిని 'వర్సాంద్ బారియా'గా పోలీసులు గుర్తించారు.

'Save me from ghosts', man files police complaint in Gujrat
దెయ్యం బారి నుంచి నన్ను కాపాడండి.. ప్లీజ్!

By

Published : Jul 1, 2021, 12:09 PM IST

గుజరాత్​ పంచమహల్ జిల్లా జోట్వాడ్ గ్రామానికి చెందిన వర్సాంగ్ బారియా ఓ వింత ఫిర్యాదుతో పోలీసు స్టేషన్​ మెట్లెక్కాడు. తనను చంపేందుకు దెయ్యాలు ప్రయత్నిస్తున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను పొలంలో పని చేస్తుండగా దెయ్యాలు కనిపించి తనతో మాట్లాడాయని.. ఆ సమయంలోనే తనను చంపేస్తాయని బెదిరించినట్లు బాధపడ్డాడు.

దెయ్యం నుంచి కాపాడండి అంటున్న వర్సాంగ్ బారియా

'మానసిక వ్యాధి వల్లే..'

అయితే.. వర్సంద్ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అతని సోదరుడు సైతం ధ్రువీకరించాడు. సంవత్సర కాలంగా అతను ఈ వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స సైతం తీసుకుంటున్నాడని వివరించాడు.

దెయ్యం నుంచి నన్ను కాపాడండి అంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదు

ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించగా.. వర్సాంగ్ బారియాకు మెరుగైన మానసిక చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details