Man Donates Body For Corona Research: కరోనా పాజిటివ్ వచ్చిన ఓ క్యాన్సర్ రోగి తన దాతృత్వాన్ని చాటాడు. తన శరీరం సమాజం కోసం ఉపయోగపడితే చాలనుకున్నాడు. కరోనాపై పరిశోధన కోసం మరణానికి ముందే తన శరీరాన్ని దానం చేశాడు. దేశంలో ఇలా చేయడం.. ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిర్మల దాస్(89) కోల్కతాలో నివసిస్తున్నాడు. అతను క్యాన్సర్ వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నాడు. ఈ మధ్యనే కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. దీంతో తన శరీరం ఇతరుల మేలు కోసం ఉపయోగపడాలని భావించాడు. మరణానికి ముందే వైద్య పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేశాడు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు శనివారం నిర్మల దాస్ తన శరీరాన్ని అప్పగించనున్నాడు.