ఎన్నికల్లో గెలిచేందుకు బ్రహ్మచర్య వాగ్దానాన్ని సైతం బేఖాతరు చేసి వివాహాం చేసుకున్న ఓ వ్యక్తికి నిరాశే మిగిలింది. పంచాయతీ ఎన్నికల కోసం పెళ్లి చేసుకుని.. తన భార్యను పోటీలో నిలబెట్టినా పరాభవం చవిచూశారు ఆ వ్యక్తి.
ఇదీ జరిగింది..

ఉత్తర్ప్రదేశ్ బాలియాకు చెందిన హతి సింగ్(45) జీవితాంతం వివాహం చేసుకోనని వాగ్దానాలు చేశారు. రాజకీయంగా ఎదగాలని కలలు కన్నారు. అయితే.. ఎన్నికల బరిలో దిగాలనుకున్న ఆయనకు.. ఈ సారి నిరాశే ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మహిళలకే దక్కిందని తెలిసింది. దీంతో ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని వీడి పెళ్లి చేసుకున్నారు. తన భార్యను ఎన్నికల బరిలో నిలబెట్టారు. అయినప్పటికీ ఆయనను గెలుపు వరించలేదు. మే 5న వెల్లడించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో హతిసింగ్ భార్య కూడా పరాభవం చవిచూశారు.
2015లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన హతిసింగ్.. 57 ఓట్లతో ఓడిపోయారు.