ఉత్తర్ప్రదేశ్ బాలియాకు చెందిన హతి సింగ్(45) జీవితాంతం వివాహం చేసుకోనని వాగ్దానాలు చేశారు. రాజకీయంగా ఎదగాలని కలలు కన్నారు. అయితే.. ఎన్నికల బరిలో దిగాలనుకున్న ఆయనకు.. ఈ సారి నిరాశే ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మహిళలకే దక్కిందని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి నెగ్గాలని ఆశించిన సింగ్.. తొలుత తాను చేసిన శపథాన్ని వెనక్కి తీసుకున్నారు. నిధి సింగ్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. తన భార్యను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.
"గ్రామాభివృద్ధి, దేశ సేవకంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. అందుకే నిధి సింగ్ను వివాహం చేసుకున్నాను. గ్రామాభివృద్ధికై పాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా."