Head Stuck in Lift: కేరళలో విషాదం జరిగింది. కార్గో లిఫ్ట్‌లో తల ఇరుక్కొని.. ఓ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అంబలాముక్కు ప్రాంతంలోని శానిటరీ ఉత్పత్తులు విక్రయించే ఓ షోరూంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుడిని నీమమ్ జిల్లాకు చెందిన సతీశ్‌గా గుర్తించారు. అతడు గత 18 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నా.. అతడిని కాపాడలేకపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. సతీశ్‌కు భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
దారుణం.. లిఫ్ట్‌లో తల ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం - శానిటరీ ప్రొడక్ట్స్
Head Stuck in Lift: లిఫ్ట్‌లో తల ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. అతడిని కాపాడలేకపోయారు.