మహారాష్ట్ర ముంబయికి చెందిన ఓ 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి స్నేహితుడిని చెంపదెబ్బ కొట్టినందుకే ఈ చర్యలు తీసుకున్నారు. అయితే.. ఆ దెబ్బ తిన్న వ్యక్తి ప్రాణాలతో లేడు. కుర్లా ప్రాంతంలో వారు మద్యం సేవిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
తాగిన మత్తులో చెంపదెబ్బ కొట్టాడు- ప్రాణాలు పోయాయ్! - Man dies after being slapped by friend
మద్యం మత్తు.. ఇద్దరి జీవితాల్ని చిత్తు చేసింది. ఒకరి ప్రాణాలు పోగా.. మరొకరు కటకటాలపాలయ్యారు. తాగిన మైకంలో స్నేహితుడిని చెంపదెబ్బ కొట్టగా.. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
చెంపదెబ్బ కొట్టాడు, Man dies after being slapped by friend
సోమవారం మద్యం తాగుతున్న సమయంలో రాహుల్ కాంబ్లే, అవినాశ్ బాలేకర్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలోనే.. అవినాశ్‌ను రాహుల్ చెంపదెబ్బ కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు నిర్ధరించారు వైద్యులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రాహుల్‌ను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: పోలీసులకు వ్యాపారి 'కట్టుకథ'.. చివరకు!